
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyan speech In mangalagiri janasena party meeting: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కులాల చుట్టు తిరుగుతున్నాయి. ఈ కుల రాజకీయాలు మారనంత వరకు ఏపీ బాగు పడదని పవన్ కళ్యాణ్ ఇటీవల చాలా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా విజయవాడ కస్టోడియల్ ఘటన తర్వాత ఈ వివాదం కూటమి వర్సెస్ వైసీపీ పార్టీల మధ్య పీక్స్ కు చేరింది. ఇక తాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీలో తాజా రాజకీయాలపై జనసేన కార్యకర్తలకు దిశానిర్దేషం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యా చరణ సమావేశంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇటీవల చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో సీఎం చంద్రబాబు సతీమణిని నోటికొచ్చినట్లు మాట్లాడిన చరిత్ర వైసీపీదని తీవ్రంగా విమర్శించారు. 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసిన వైసీపీ పార్టీలో ఇంకా మార్పు రాలేదన్నారు. వారు ఇప్పుడే కాదు.. రేపు ఒక్క సీటు వచ్చిన అస్సలు తగ్గొద్దని సెటైర్లు వేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన మాట్లాడరని అన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం లేకపోయిన అదే టెంపో కొనసాగించడం నిజంగా గ్రేట్ అంటూ పంచ్ లు వేశారు. వైసీపీ నేతలను తగ్గించాలని తాను ఎప్పుడు అనుకొనని అన్నారు. ఇప్పుడు మీలో ఎంత రియలైజేషన్ వచ్చిందో నేను చూస్తానన్నారు.మీరు ఎన్ని కుట్రలు చేసిన మేము బలపడటం గ్యారంటీ.. Choice