Zee Telugu•28 Oct 2026
స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..30 ఏళ్ల నాటి జ్ఞాపకంతో కంటతడి పెట్టుకున్నారుదార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. PM Modi Emotional In New Zealand: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన భారతీయ కమ్యూనిటీ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 40 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక పర్యటన.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 140 కోట్ల మంది భారతీయ సోదర సోదరీమణుల శుభాకాంక్షలను మీకు అందించడం నాకెంతో గర్వంగా ఉంది" అని ప్రవాస భారతీయులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. స్టేజ్‌పై 30 ఏళ్ల నాటి మఫ్లర్! తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో లేని రోజులను ప్రధాని ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల క్రితం తాను సాధారణ పౌరుడిగా న్యూజిలాండ్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఒక స్నేహితుడు తనకు ఇచ్చిన బహుమతిని అందరికీ చూపించారు. "ప్రధానిగా ఇది నా మొదటి పర్యటన కావచ్చు. కానీ 25-30 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన ఒక స్నేహితుడు నాకు ఒక టోపీ, చేతి తొడుగులు, ఒక మఫ్లర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ రోజు నేను మీ ముందుకు అదే మఫ్లర్‌ను ధరించి వచ్చాను. ఇన్నేళ్లుగా దీనిని నేను ఎంతో భద్రంగా దాచుకుని వాడుతున్నాను. ఈ రోజు మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎంత