
Read Also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా? ఎన్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే


Read Also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా? ఎన్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే

Sangareddy mineral deposits: రాష్ట్రంలో అరుదైన కీలక ఖనిజ నిక్షేపాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అరుదైన ఖనిజనిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. జిల్లాలోని మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధి పర్వతాపూర్ శివారులోని భూముల్లో వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు ఉన్నట్టు జియోలజికల్ సర్వే విభాగం అధికారులు, నిపుణులు గుర్తించారు. ఈ ఖనిఖ నిక్షేపాలు ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలతో పాటు, ఇంధన నిల్వలకు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు. కేంద్రప్రభుత్వ ఆదేశాలమేరకు ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సంబంధిత శాఖాధికారులు, నిపుణులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించారు. సర్వే నంబర్ 5 నుంచి 48 వరకు 800 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ, పట్టా భూముల్లో ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఈ భూముల్లో 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో 15.25 మిలియన్ టన్నుల వెనేడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్, టైటానియం నిక్షేపాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. Read Also : Warangal IT Employee Keerthana:సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చిన ముప్పు.. పని ఒత్తిడి భరించలేక యువ టెక్కీ ఆత్మహత్య! జహీరాబాద్ పట్టణానికి అతి సమీపంలో పర్వతాపూర్ బ్లాక్ ఉండటం, రవాణా, రోడ్డు, రైలు మర్గాలు దగ్గరగా ఉండడంతో పెట్టుబడిదారులకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖనిజ నిక్షేపాలను వెలికితీయడంతో పాటు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రోడ్ షో నిర్వహించారు. ఈ నెల 11న గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన గనుల వేలం పాటలో కేంద్రం ఆధీనంలోని ఎన్ఎల్ సీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రాధాన్య బిడ్డర్గా పాల్గొని గనులను దక్కించుకుంది. కాగా ఖనిజ నిక్షేపాల వెలికితీత, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగానూ అభివృద్ధి చెందనుంది. ఖనిజ నిక్షేపాలు, నిమ్స్ ప్రాజెక్టు