
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కరుప్పు చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఫుల్ జోరుమీదున్న విషయం తెల్సిందే.. ప్రస్తుతం సూర్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కరుప్పు చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఫుల్ జోరుమీదున్న విషయం తెల్సిందే.. ప్రస్తుతం సూర్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తోన్న చిత్రం విశ్వనాథ్ & సన్స్ (Vishwanath And Sons). టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో క్రేజీ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తోండగా.. రవీనా టాండన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన సాంగ్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. విశ్వనాథ్ & సన్స్ ఆగస్టు 14 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని మేకర్స్ పెంచేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సూర్య అభిమానుల కోసం ఒక అదిరిపోయే ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రం కోసం హీరో సూర్య సింగర్ గా మారినట్లు తెలిపాడు. ఒక ప్రత్యేకమైన మాస్ డ్యాన్స్ నంబర్ ని సూర్య అలపించనున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సాంగ్ కి లిరిక్స్ ని యూత్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు, గీత రచయిత అయిన కెన్ కరుణాస్ అందిస్తోన్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూర్యకి పాడడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన నటించిన సికందర్ చిత్రంలో ఏక్ దో తీన్ అని సాగే సాంగ్ ని సూర్యనే అలపించాడు. ఆ పాట ఎంత పెద్ద చార్ట్‌బస్టర్ అయిందో