
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చంద్రబాబు ఓపోస్టు పెట్టరు. తనకు, తన బృందానికి ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి చూపించిన ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ‘మీతో ప్రత్యక్షంగా మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చింది. మీరు చూపిన ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞుడిని’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. సింగపూర్‌లో పలువురు తెలుగు కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలుసుకుని స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ప్రవాస తెలుగు సమాజంతో ఆయన కాసేపు ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు పలు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్