సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధి
Actor ProfilePolitician

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధి

Total News1
Movie Updates0
Sources1
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
Andhra Jyothy15 Jun 2026
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ (PM Lawrence Wong)తో ఈరోజు (సోమవారం) మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక రంగ సహకారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో సహకారం అందించాలని సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధానిని కోరారు. ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి, నైపుణ్యాల పెంపు (కెపాసిటీ బిల్డింగ్) అంశాల్లో సింగపూర్ మద్దతు అవసరమని వివరించారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్, నగర ప్రణాళిక, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సింగపూర్ ప్రధాని ప్రత్యేక ఆసక్తి చూపించారు. విద్యాసంస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాల గురించి లారెన్స్ వాంగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి నివాసయోగ్య నగరాల సరసన నిలుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం అభివృద్ధి, జనాభా నిర్వహణకు సంబంధించిన చర్యలను కూడా వివరించారు. వ్యవసాయ రంగంపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ప్రకృతి సేద్యం ఉత్పత్తులకు అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. పోర్టులు

స గప ర ప రధ న ల ర న స వ గ త స ఎ చ ద రబ బ భ ట ఏప అభ వ ద ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in