సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. గూగుల్ క్లౌడ్ తో ఏఐ టాస్క్ ఫోర్స్
Actor ProfilePolitician

సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. గూగుల్ క్లౌడ్ తో ఏఐ టాస్క్ ఫోర్స్

Total News1
Movie Updates0
Sources1
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. గూగుల్ క్లౌడ్ తో ఏఐ టాస్క్ ఫోర్స్
Oneindia Telugu15 Jun 2026
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. గూగుల్ క్లౌడ్ తో ఏఐ టాస్క్ ఫోర్స్

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, సంపద సృష్టి, ఉద్యోగ కల్పన లక్ష్యాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటన తొలిరోజే సూపర్ సక్సెస్ అయింది. మౌలిక సదుపాయాలు, విద్యా రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు చేస్తూ వరుస సమావేశాల్లో పాల్గొన్నారు.1. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో ఆయన అధికారిక నివాసంలో దాదాపు 30 నిమిషాల పాటు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణ పురోగతి, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న మౌలిక వసతుల గురించి సింగపూర్ ప్రధానికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, అర్బన్ గవర్నెన్స్‌లో ఏపీకి సాంకేతిక తోడ్పాటు అందించాలని కోరారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని వివరించడంతో పాటు, రాష్ట్రంలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల, శిశు సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.2. హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశంపర్యటన ప్రారంభంలో సింగపూర్‌లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, షిప్ బిల్డింగ్ - సివిల్ ఏవియేషన్‌లో ఎంఆర్‌వో (MRO) కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను సీఎం వివరించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ప్రపంచ స్థాయి నాణ్యత గల ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం పెట్టుబడులకు సిద్ధంగా ఉందని సీఎం పేర్కొనగా, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ రంగాల్లో ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని అంబులే హామీ ఇచ్చారు.3. స్టార్టప్ వెంచర్

స గప ర ప రధ న త చ ద రబ బ భ ట గ గ ల క ల డ త ఏఐ ట స క ఫ ర స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in