
Two-Year Trust Program | విజయనగరం, జూన్ 15: ప్రభాతవార్త :రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం” కార్యక్రమంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్ధిదారులు తమ జీవితాల్లో చోటుచేసుకున్న సానుకూల మార్పులను హృదయపూర్వకంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా కొత్త ఆశలను నింపాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. Read Also: Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ జామి మండలానికి చెందిన కె. వెంకటగోపాల్ మాట్లాడుతూ, తన బావ గంజాయి వ్యసనానికి గురవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసు శాఖ ప్రత్యేక బృందం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో తన బావ పూర్తిగా మారిపోయారని చెప్పారు. “ఒకప్పుడు మా కుటుంబం భవిష్యత్తుపై ఆందోళన చెందేది. ఇప్పుడు మా బావ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. నా మేనల్లుడు కూడా చక్కగా చదువుకుంటున్నాడు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేస్తున్న కృషి అమూల్యమైనది” అంటూ ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శృంగవరపుకోట మండలానికి చెందిన శ్రీమతి చింతాడ భవాని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు తమ కుటుంబ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేశాయని చెప్పారు. “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోంది. మా కుటుంబంలోని వృద్ధులకు నెలకు రూ.4 వేల ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ వస్తోంది. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం లభిస్తున్నాయి. మహిళా సంఘం ద్వారా రుణం తీసుకుని పాల డెయిరీ ఏర్పాటు చేసుకున్నాం. చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ ఆదాయం
