స్కూల్ లో రక్తపాతం.. వీడియో గేమ్
Actor ProfileCelebrity

స్కూల్ లో రక్తపాతం.. వీడియో గేమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స్కూల్ లో రక్తపాతం.. వీడియో గేమ్ పై బ్యాన్
Sakshi18 Jul 2026
స్కూల్ లో రక్తపాతం.. వీడియో గేమ్ పై బ్యాన్

ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ విషాదకర పాఠశాల కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తరచూ ఆడే హింసాత్మక వీడియో గేమ్‌ను ప్రభుత్వం నిషేధించడంతో వీడియో గేమ్స్ నిజంగానే యువతను హింసాత్మకంగా మారుస్తాయా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ నగరంలోని ఓ హైస్కూల్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, నిందితుల్లో ఒకరు గోరేబాక్స్‌(GoreBox) అనే హింసాత్మక వీడియో గేమ్‌ను తరచూ ఆడేవాడని గుర్తించారు. ఈ నేపథ్యంలో జాగ్రత్త చర్యగా ఆ గేమ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటించింది. GoreBox అనేది ఆయుధాలు, పేలుళ్లు, రక్తపాతం, విధ్వంసక చర్యలతో కూడిన సాండ్‌బాక్స్ తరహా గేమ్. ఇందులో ఆటగాళ్లు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించి వర్చువల్ ప్రపంచంలో హింసాత్మక చర్యలకు పాల్పడవచ్చు. గేమ్‌లోని కంటెంట్ కారణంగానే ఇది గతంలో కూడా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ గేమ్‌ను ఆడిన వ్యక్తే కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అయితే, ఇక్కడే అసలు చర్చ మొదలైంది. గేమ్ ఆడిన వ్యక్తి నేరానికి పాల్పడితే, ఆ నేరానికి గేమ్‌ను కారణంగా చూపవచ్చా? అనే ప్రశ్నకు నిపుణులు అంత సులభంగా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు కూడా గేమ్ వల్లే కాల్పులు జరిగాయి అని ఎక్కడా ప్రకటించలేదు. కేవలం నిందితుడు ఆ గేమ్‌ను ఎక్కువగా ఆడేవాడని మాత్రమే వెల్లడించారు. ఇక విచారణలో మరో కీలక విషయం కూడా బయటకు వచ్చింది. నిందితులిద్దరూ కొంతకాలంగా పాఠశాలలో వేధింపులు, బుల్లీయింగ్ ఎదుర్కొన్నట్లు సమాచారం. అలాగే ఆయుధాలు ఎలా వారి చేతికి చేరాయి? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మానసిక స్థితి ఏమిటి? వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి

స క ల ల రక తప త వ డ య గ మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in