
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Urdu teaching controversy at Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో స్థానికంగా ఉన్న భరత్ చంద్ర పాఠశాలలో ఉర్దూ బోధించడం పెను దుమాంగా మారింది. భరత్ చంద్ర పాఠశాలలో ఎలాంటి అనుమతి లేకుండా 1 నుంచి 5 వ తరగతి విద్యార్థులకు హింది బదులు ఉర్దు బోధిస్తున్నట్లు విషయం బైటపడింది. దీంతో స్థానిక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి స్కూల్ కు తరలివచ్చారు. విద్యార్థుల నోట్ బుక్ లను పరిశీలించగా ఉర్దు బోధిస్తున్నట్లు రాతలు బైటపడ్డాయి. స్కూల్ విద్యార్థులు సైతం తమకు ఉర్దూ బోధిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ ఆర్మూర్ అధ్యక్షులు మందుల బాలు, నూతన శ్రీనివాస్ తదితరులు ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్, ఉర్దూ బోధిస్తున్నట్లు చెబుతున్న ఉపాధ్యాయుడిపై సీరియస్ అయ్యారు. అప్పటికే విద్యాశాఖ అధికారులు , పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈక్రమంలో బీజేపీ నేతలు తమ పిల్లలకు పాఠశాలలో కల్మాలు, అనుమతిలేని ఉర్దూ నేర్చించడం ఏంటని మండిపడ్డారు. కొంత మంది పిల్లల్ని స్కూల్ దశ నుంచి ఇతర మతాల్లోకి వెళ్లేలా వారిలో చెడు భావనలను నింపుతున్నారని, లవ్ జీహద్ లవైపు వెళ్లేలా వారిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఉర్దూ ఉపాధ్యాయుడిపై బీజేపీ నేతలు చేయిచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఇప్పటికే ఎంఈవో,స్థానిక ఎమ్మార్వో సైతం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. మరోవైపు అనుమతిలేనిదే స్కూల్ లో ఉర్దు బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముస్లిం ఉపాధ్యాయుడ్ని తిట్టి, చేయిచేసుకున్నారన్న ఆరోపణలపై బీజేపీ నేతలపై మరో కేసు