సీఐ నాగరాజు అరెస్ట్ వీల్లేదు
Actor ProfilePolitician

సీఐ నాగరాజు అరెస్ట్ వీల్లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఐ నాగరాజు అరెస్ట్ వీల్లేదు - మద్దతుగా ర్యాలీలు
Oneindia Telugu28 Jun 2026
సీఐ నాగరాజు అరెస్ట్ వీల్లేదు - మద్దతుగా ర్యాలీలు

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న సీఐ నాగరాజును ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ మొదలు పెట్టింది. నాగరాజు అరెస్ట్ కు ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనే సీఐ నాగారాజుకు మద్దతుగా స్థానికులు రోడ్డు పైకి వచ్చారు. నాగరాజును అరెస్ట్ చేయవద్దని నినాదాలు చేస్తున్నారు. మరో వైపు కేసు విచారణ ప్రక్రియ వేగవంతం అయింది.సీఐ నాగరాజు కు మద్దతుగా కృష్ణలంకలో రోడ్ల పైకి వచ్చి మహిళలు, యువకుల ర్యాలీలు చేస్తున్నారు. సీఐ నాగరాజు వల్లే కృష్ణలంకలో ధైర్యంగా ఉన్నామంటూ నినాదాలు ఇస్తున్నారు. నాగరాజుకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ చేసిన మహిళలు.. నేడు రాణిగారితోట ప్రాంతంలో ర్యాలీ చేసేందుకు సిద్దమయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుపై హత్యానేరం కింద కేసు నమోదైన తర్వాత ఆయనకు ప్రజల నుంచి మద్దతు వస్తోంది. నాగరాజును అరెస్టు చేస్తారన్న ప్రచారం జరగడంతో కృష్ణలంక, రాణిగారితోట, బాలాజీనగర్‌ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువకులు అజిత్‌సింగ్‌నగర్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. వేకువజాము నుంచే పోలీసులు ఆయన ఇంటి వద్ద కాపలా కాశారు. పోలీసులను చూడగానే మహిళలు, యువకులు నిరసనకు దిగారు. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజును అరెస్టు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఈ రూట్లలో వందేభారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్- షెడ్యూల్, ముహూర్తం..!!స్థానికులు నినాదాలు.. సిట్ విచారణసీఐ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నాగరాజు కృష్ణలంక ఇన్‌స్పెక్టర్‌గా చేరాకే మహిళలు, అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆకతాయిల ఆటకట్టించారన్నారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో చూసి సిబ్బందిని పంపేవారని తెలిపారు. నేరగాళ్ల విషయంలో కఠినంగా ఉన్న ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాత్రి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుకు మద్దతుగా

స ఐ న గర జ అర స ట వ ల ల ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in