సీఎం గారూ 12 శాఖలు మీ వద్దేనా? చిక్కుల్లో పడతారు జాగ్రత్త
Actor ProfilePolitician

సీఎం గారూ 12 శాఖలు మీ వద్దేనా? చిక్కుల్లో పడతారు జాగ్రత్త

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సీఎం గారూ 12 శాఖలు మీ వద్దేనా? చిక్కుల్లో పడతారు జాగ్రత్త
Eenadu3 Aug 2026
సీఎం గారూ 12 శాఖలు మీ వద్దేనా? చిక్కుల్లో పడతారు జాగ్రత్త

Digvijaya Singh | ఉజ్జయిని: తన వద్ద 12 శాఖలను పెట్టుకుని మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ (Digvijay Singh) వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆయనే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. భూ కొనుగోలు విషయంపై ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం ఇలా స్పందించారు. ‘మోహన్‌ యాదవ్‌ జీ.. మీ వద్దే 12 శాఖలు పెట్టుకున్నారు. మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఇబ్బందుల్లో పడతారు. ఏ ఒక్క అధికారి తప్పు చేసినా, అక్రమాలకు పాల్పడినా.. చివరికి మీరే చిక్కుల్లో పడతారు. నేను మధ్యప్రదేశ్‌కు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించా. నాపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు. ఎందుకంటే ఏ ఒక్క శాఖ కూడా నావద్ద పెట్టుకోలేదు. గతంలో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ హయాంలో నా ఫైల్స్‌ అన్నీ పరిశీలించినా.. నాకు వ్యతిరేకంగా ఏమీ దొరకలేదు. కావాలంటే ఇప్పుడు మీరు నాపై విచారణ చేయించండి. భూ కుంభకోణంలో ఏయే కంపెనీల ప్రయేయం ఉందో నేనూ అధ్యయనం చేస్తున్నా. మమ్మల్ని కొనుగోలు చేస్తామని అనుకోవద్దు. మేం అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేం. ఎవరెవరైతే అమ్ముడు పోయారో వాళ్లు ఇప్పటికే భాజపాలో చేరారు. న్యాయం కోసం పోరాటం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులందరం సిద్ధంగా ఉన్నాం’ అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. 70 ఏళ్లు.. నాలుగు తరాలు: సుదీర్ఘ భూవివాదాన్ని ముగించిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సీఎం నిర్వర్తిస్తున్న శాఖలపైనా దిగ్విజయ్‌ విమర్శలు గుప్పించారు. హోం, జైళ్లు, ప్రజా సంబంధాలు, నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్, ఏవియేషన్‌ సహా మొత్తంగా 12 శాఖలను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకోవడం పెద్ద తప్పిదమేనన్నారు. భవిష్యత్తులో ఆయనకు చిక్కులు తప్పవని హెచ్చరించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ