బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల కేసులో కీలక నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతో పిటిషన్ దాఖలు చేశాడు. తాను స్వచ్ఛందంగా కోర్టు ఎదుట లొంగిపోయి విచారణకు సహకరిస్తానంటూ అన్మోల్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం అన్మోల్ బిష్ణోయ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. 2025 నవంబర్‌లో అమెరికా నుంచి భారతదేశానికి అన్మోల్‌ను సరెండర్ చేశారు. ఆ తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన ఉగ్రవాద - గ్యాంగ్‌స్టర్ సంబంధాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతన్ని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆ కేసులో న్యాయ విచారణ ఖైదీగా ఉన్నందున ముంబై కోర్టులో హాజరయ్యేందుకు కోర్టు ప్రత్యేక ఆదేశాలు అవసరమని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తీహార్ జైలులోతీహార్ జైలు నుంచి ముంబై కోర్టుకు హాజరుపరిచేందుకు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలంటూ అన్మోల్ కోర్టును కోరాడు. కుదిరితే ప్రత్యక్షంగా లేకపోతే వర్చువల్ విధానంలో తన రిమాండ్ ప్రక్రియ నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేశాడు. తాను లొంగిపోవడంతో ఎలాంటి నష్టం ఉండదని, పైగా విచారణ వేగవంతం అవుతుందని పేర్కొన్నాడు. READ ALSO లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు జీవిత ఖైదు!సల్మాన్ ఖాన్ ఇంటి కాల్పుల కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదయ్యాయని అన్మోల్ పిటిషన్‌లో వెల్లడించాడు. అన్మోల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్.నవేందర్.. ప్రభుత్వ తరఫు న్యాయవాదిని సమాధానం దాఖలు చేయాలని ఆదేశించారు. అసలేం జరిగింది అంటే..?ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న గ్యాలక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద సల్మాన్ ఖాన్ నివాసం బయట 2024 ఏప్రిల్ 14న బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
Actor ProfilePolitician
సల్మాన్ ఖాన్' కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోతానన్న బిష్ణోయ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Sept 2026
సల్మాన్ ఖాన్' కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోతానన్న బిష్ణోయ్