
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థాన్ పౌరుడు అనుమానాస్పదంగా నియంత్రణ రేఖను దాటాడు. నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా అప్రమత్తమైన చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే అవకాశాన్ని నివారించింది. "నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా, అప్రమత్తంగా ఉన్న చినార్ వారియర్స్ జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి జూన్ 12న కుప్వారాలోని సిమ్రీ గ్రామం సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో నియంత్రణ రేఖ దాటిన ఓ పాక్ పౌరుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే ప్రమాదాన్ని నివారించింది. చొరబాటుదారుడిపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది" అని చినార్ కార్ప్స్ ఎక్స్ ద్వారా పోస్టు చేసింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) అంటే భారత్, పాకిస్థాన్ అధీన ప్రాంతాల మధ్య ఉన్న సైనిక విభజన రేఖ. ఈ ప్రాంతం చాలా కీలకం. ఉగ్రవాదులు చొరబడకుండా సైనికులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) 'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు) సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు) 'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు) ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు) 15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికే.. సంచలన ఆడియోతో బయటపడ్డ లోకేష్ బండారం మంత్రి సంధ్యారాణికి బిగ్ షాక్ YSRCPలో చేరిన 320 TDP కుటుంబాలు ప్రత్తిపాడు లో పోలీసులు ఓవర్ యాక్షన్.. కాలుతున్న కర్రను