
కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెష ల్ ఇంటెన్స్ రివిజన్ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకు వచ్చింది. కుమరం భీం ఆసి ఫాబాద్ జిల్లాలో ఓటర్ల సవరణలో భాగంగా బీఎల్‌వోలు ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వారంలో తిరిగి ఇవ్వాలని చెబుతు న్నట్లు ఓటర్లు చెబుతున్నారు. చింతలమానేపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెష ల్ ఇంటెన్స్ రివిజన్ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకు వచ్చింది. కుమరం భీం ఆసి ఫాబాద్ జిల్లాలో ఓటర్ల సవరణలో భాగంగా బీఎల్‌వోలు ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వారంలో తిరిగి ఇవ్వాలని చెబుతు న్నట్లు ఓటర్లు చెబుతున్నారు. కానీ వాటిపై పూర్తి స్థాయిలో ఓటర్లకు ఫారాలు ఫిల్ చేసే విధానం తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రస్తుతం చాలా మందికి ఎస్‌ఐఆర్ ఫారం నింపడం సమస్యగా మారింది. ఎన్యూమ రేషన్ ఫారాలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేసి బీఎల్‌వోలకు ఇస్తే ఫారాలను డిజిటలైజేషన్ చేస్తారు. కానీ ఓటర్లు ఈఎఫ్ ఫారా లను నింపేందుకు సరైన అవగాహన లేక నింపలేక పోతున్నామని చెబుతున్నారు. జిల్లాలో రెండు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో 3,96,942 మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో ఆసిఫాబాద్ లో 2,26,778 మంది ఓటర్లు, సిర్పూర్‌లో 1,70,164 మంది ఓటర్లు ఉన్నారు. వీరం దరికీ ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ జిల్లాలో పకడ్భందీగా పూర్తి చేసే దిశగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సమా వేశాలు ఏర్పాటు