
గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ను రాజ్ నిడిమోరు డైరెక్టర్ చేశారు. సమంత అందులో నటించింది. అప్పుడే వాళ్లిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ టైంలో సమంత, రాజ్ మొదటి భార్య శ్యామలీ కూడా ఫ్రెండ్స్. ఒకరి పోస్టులకు ఒకరు కామెంట్లు కూడా చేసుకునేవారు. 2023లో తన భర్త పుట్టినరోజున శ్యామలీ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత రాజ్ గురించి ఆమె మాట్లాడలేదు. రాజ్, సమంత పెళ్లికి ఒక రోజు ముందు శ్యామలీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, “నిరాశలో ఉన్నవాళ్లు నిరాశపరిచే పనులే చేస్తారు” అని రాశారు.ప్రస్తుతం విడాకుల తర్వాత ఆమె జ్యోతిష్కురాలు, ఆధ్యాత్మిక గురువుగా పనిచేస్తున్నారు.ఆమె ఇప్పుడు రేకీ, సంఖ్యాశాస్త్రం కూడా నేర్చుకున్నారు. ప్రతీ ఏటా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని, తన వ్యక్తిత్వం ఇదేనని చెప్పలేనని శ్యామలీ ఓ పోస్టులో తెలిపారు. గతంలో ఆమె సైకాలజీ చదివారు, సినిమా డైరెక్షన్ కూడా చేశారు. ప్రస్తుతం జ్యోతిషం గురించే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. శ్యామలీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ రాజ్ గురించిన పోస్టులు చాలా ఉన్నాయి. రాజ్ మంచి భాగస్వామి అని కూడా ఆమె రాసుకొచ్చారు. విడాకుల తర్వాత కూడా ఆమె ఆ పోస్టులను డిలీట్ చేయలేదు. రాజ్ మీద శ్యామలీకి ఉన్న ప్రేమను చూసి, సమంత వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2023లో శ్యామలీ, రాజ్ బానే ఉన్నట్టు కనిపించింది. 2023 తర్వాత రాజ్, శ్యామలీ మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారని అంటున్నారు. కొందరేమో 2021లోనే విడాకులు అయ్యాయని చెబుతున్నారు. 2019లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ మొదలైంది. అప్పుడే సమంత, రాజ్ కలిసి పనిచేయడం ప్రారంభించారు. 2023 వరకు సమంత, శ్యామలీ బాగానే ఉన్నారని అంటున్నారు. ఆ తర్వాత రాజ్, సమంత దగ్గరవడంతో శ్యామలీ, సమంత దూరం అయ్యారు. సమంత వల్లే రాజ్, శ్యామలీ విడాకులు తీసుకున్నారని ప్రచారం