సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్
Actor ProfileActor

సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్
TV9 Telugu20 Aug 2026
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ మా ఇంటి బంగారం. సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా.. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ సీన్లలో సామ్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సక్సెస్ మీట్ లో సామ్ బేబీ బంప్ వైరల్ కావడంతో ఆమె తల్లి కాబోతుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక ఆ మూవీ థాంక్స్ మీట్ లో సామ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అలాగే మా ఇంటి బంగారం సినిమా తర్వాత తాను కొన్ని రోజులు విరామం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో సమంత ఈ గుడ్ న్యూస్ తనకు చెప్పారని.. ఎవరికీ చెప్పొద్దన్నారని దర్శకురాలు నందినిరెడ్డి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎక్కువ మంది చదివినవి : Irumudi : సాంగ్ అదిరిపోయింది.. ఇరుముడి నుంచి ఇరుముడి కట్టు పాట రిలీజ్.. వింటూ ఉండిపోవాల్సిందే భయ్యా.. నందినిరెడ్డి మాట్లాడుతూ.. “9 గంటలకు షూట్ ప్రారంభమవుతుందంటే సామ్ కచ్చితంగా ఆ సమయనికి సెట్ లో ఉంటారని.. తస్సాదియా సాంగ్ షూటింగ్ సమయంలో సమంతకు జ్వరం వచ్చిందని.. 11.30 వస్తారని అన్నారు. నాకేమో టెన్షన్.. మొదట ఈ పాటను 4 రోజులు చేయాలని అనుకున్నాం. షెడ్యూల్ కారణంగా రెండు రోజులకు కుదించాల్సి వచ్చింది. ఒక వైపు సామ్ హెల్త్ బాలేదు.. మరోవైపు ఎలా పూర్తవుతుందా అనే టెన్షన్.. ముందుగా చెప్పినట్లు 11.30కు వచ్చి షూట్ కంప్లీట్ కాగానే వెళ్లిపోయింది. మళ్లీ రెండో రోజు రాగానే జ్వరం తగ్గిందా.. ఎందుకు అలా ఊరికే వస్తుంది అని అడిగాను

సమ త ప ర గ న ట అన త ల స న తర వ త త స న సన న వ శ ల ఇవ అసల వ షయ చ ప ప న డ ర క టర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in