సమంత టాప్ 5 డిజాస్టర్లు
Actor ProfileActor

సమంత టాప్ 5 డిజాస్టర్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత టాప్ 5 డిజాస్టర్లు, సామ్ ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా
Asianet News Telugu18 Jun 2026
సమంత టాప్ 5 డిజాస్టర్లు, సామ్ ని కోలుకోలేని దెబ్బకొట్టిన చిత్రాలివే.. తప్పు చేసిందా

సమంత సౌత్‌ ఇండియాలోనే కాదు, ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ హీరోయిన్లలో ఒకరు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా టాప్‌ హీరోయిన్లలో సమంతదే మొదటిస్థానం. సినిమాలు లేకపోయినా తన రేంజ్‌ని, క్రేజ్‌, పాపులారిటీని చాటుకుంటోంది సమంత. తనకు ఉన్న ఫాలోయింగ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇప్పుడు సామ్‌.. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత `మా ఇంటి బంగారం` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ శుక్రవారం(జూన్‌ 19)న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సమంత నటించిన సినిమాల్లో ఐదు చెత్త మూవీస్‌ ఏంటి? బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఏంటనేది చూస్తే. సమంత నటించిన వాటిలో అత్యంత చెత్త సినిమాల్లో `శాకుంతలం` మొదటి స్థానంలో ఉంటుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పురాణాల్లోని శాకుంతలం పాత్రని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. ఆమెకి జోడీగా దేవ్‌ మోహన్‌ చేశారు. మోహన్‌ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మూడేళ్ల క్రితం విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలచింది. గుణశేఖర్‌ కి చిల్లి గవ్వ కూడా రాలేదు. ఆ తర్వాత ఈ మూవీ సమంత చేయకుండ ఉండాల్సిందనే కామెంట్స్ వినిపించాయి. సమంత నటించిన డిజాస్టర్‌ మూవీస్‌లో రెండో వరుసలో ఉన్న చిత్రం `బ్రహ్మోత్సవం`. మహేష్‌ బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సమంతతోపాటు కాజల్‌ కూడా హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. పెళ్లి సంబంధం చూడాలంటే అట ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. ఫ్యామిలీలో మళ్లీ వెనక్కి వెళ్లి తన బంధువులను వెతుక్కునే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. పదేళ్ల క్రితం(2016)లో విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి టీ ఖర్చులు కూడా రాలేదనే టాక్‌ వినిపించింది. సమంతకి పెద్ద డిజాస్టర్లు ఇచ్చిన చిత్రాల్లో తమిళ మూవీ `సికిందర్‌`(అంజాన్‌) కూడా ఉంది. సూర్య హీరోగా రూపొందిన చిత్రమిది