
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Maa Inti Bangaram Rating: కథ స్వర్ణ (సమంత) తన గతాన్ని దాచిపెట్టి సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే ఆమె గతానికి సంబంధించిన కొన్ని సంఘటనలు మళ్లీ ఆమె జీవితంలోకి రావడంతో కుటుంబం పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. తన కుటుంబాన్ని ఆ ప్రమాదం నుంచి స్వర్ణ ఎలా కాపాడింది? ఆమె గతంలో ఏమి జరిగింది? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. నటీనటులు పర్ఫామెన్స్ , టెక్నికల్ సిబ్బంది పనితీరు సమంత సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. కుటుంబానికి అంకితమైన మహిళ పాత్రలో ఆమె సహజంగా కనిపించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. గుల్షన్ దేవయ్య, దిగంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. గౌతమికి పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కలేదు. సమంత స్నేహితురాలి పాత్రలో నటించిన మంజూష మంచి నటన కనబరిచింది. ఆమెతో సమంతకు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కొన్ని సాధారణ సన్నివేశాలను కూడా బీజీఎం మరింత మెరుగ్గా చూపించింది. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సినిమా మొదటి భాగం నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను ఆకట్టుకునేందుకు సమంత చేసే ప్రయత్నాలు వినోదాన్ని పంచుతాయి. అయితే కథలో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. స్వర్ణ గతం చుట్టూ