సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా
Actor ProfilePolitician

సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా
Telugu Times18 Jul 2026
సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా

అంతా కలిసి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధిద్దాం సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక బోధనపైనే టీచర్లు శ్రద్ధ వహించాలి విద్యార్థులు చదవకపోతే ముఖ్యమంత్రి నాకు మైనస్ మార్కులు వేస్తారు మోపిదేవి హైస్కూలు నూతన భవనాల ప్రారంభోత్సవంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ కొక్కిలిగడ్డ (అవనిగడ్డ): సమాజంలో మార్పు తెచ్చేందుకే నేను అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నాను. దీనిని నేను ఛాలెంజ్ గా స్వీకరించాను. విద్యావ్యవస్థలో మార్పు తేవడం ఉపాధ్యాయుల సహకారంతోనే సాధ్యమవుతుంది. దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్నది నా ధ్యేయం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ... గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశాం, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని సూచించారు. నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాం. రాష్ట్రవ్యాప్తంగా హార్డ్ వేర్ (ఇన్ ఫ్రా) మెరుగైంది, సాఫ్ట్ వేర్ (లెర్నింగ్ అవుట్ కమ్స్) మెరుగు పర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. కొక్కిలిగడ్డ హైస్కూలులో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించాం. అభ్యసనా ఫలితాల మెరుగుదలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. ఫార్మేటివ్, సమ్మెటివ్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలి. వెనుకబడిన విద్యార్థుల పనితీరును మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ను అందజేస్తాం. వివిధ తరగతుల్లో వెనుకబడిన పిల్లలు ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకొని, అటువంటి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్డండి. నూరుశాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలతో యాడ్స్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ

సమ జ ల మ ర ప త చ చ ద క వ ద య శ ఖన ఎ చ క న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in