షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్ కు మరోసారి తలవంపులు
Actor ProfilePolitician

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్ కు మరోసారి తలవంపులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్ కు మరోసారి తలవంపులు
AP7AM31 Jul 2026
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్ కు మరోసారి తలవంపులు

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్‌లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఇస్లామాబాద్‌లో కలకలం రేపింది. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో ఈ సంఘటన మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసింది.షోయబ్ అక్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ ఈ నెల‌ 24న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ఇస్లామాబాద్‌లోని హెచ్-8 శ్మశానవాటికలో నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి 2025 పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి హాజరయ్యాడు. ఇతనితో పాటు లష్కరే రాజకీయ విభాగమైన పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్‌) అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. వీరు బహిరంగంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడం పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు తెచ్చిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత్‌లో జరిగిన 26/11 ముంబై దాడులతో పాటు ఎన్నో విధ్వంసాలకు కారణమైన లష్కరే తోయిబా సంస్థను అంతర్జాతీయ సమాజం నిషేధించింది. ఈ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన హఫీజ్ సయీద్, పీఎంఎంఎల్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ 2024 పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. కసూరి లాంటి భయంకరమైన ఉగ్రవాదులు బహిరంగంగా తిరగడం, పాకిస్థాన్ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందన్న ఆరోపణలకు

ష యబ అక తర స దర డ అ త యక ర యలక పహల గ మ స త రధ ర ప క స థ న క మర స ర తలవ ప ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in