
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం రాపో 23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో హీరో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా తాజాగా హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. కథానాయకుడు రామ్ పోతినేని చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది. దర్శకత్వం, కథతో పాటు ఈ చిత్రంలో రామ్ కథానాయకుడిగానూ నటిస్తున్నారు. కెమెరా ముందు, వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావం స్పష్టమవుతోంది. తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నారు. ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ