Gold Market Trend India 2026 : భారతీయులకు బంగారం ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రస్తుతం దేశీయ పసిడి మార్కెట్లో ఊహించని ట్రెండ్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకం పెంచిన తర్వాత.. కొత్త బంగారం కొనుగోళ్లు భారీగా క్షీణించాయి. ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) తాజా నివేదిక ప్రకారం మార్కెట్లో బంగారం డిమాండ్ ఏకంగా 70 శాతానికిపైగా పడిపోవడం గమనార్హం. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ జనాలు కొత్త నగలు కొనడం మానేసి.. తమ ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ షాపులకు క్యూ కడుతున్నారు. అసలు మార్కెట్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సుంకాల పెంపు తర్వాత భారతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ 70 శాతానికిపైగా తగ్గిందని ఐబీజేఏ సెక్రటరీ సురేంద్ర మెహ్తా చెప్పుకొచ్చారు. కేంద్రం మే 13న బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల్ని బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు కొనకుండా వాయిదా వేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సుంకాలు పెరిగాయి. విదేశీ మారకాన్ని ఆదా చేసుకునేందుకు, బంగారం కొనుగోళ్లు, దిగుమతుల్ని తగ్గించేందుకు ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొనుగోళ్లు తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో గోల్డ్ లోన్లకు కూడా గిరాకీ పెరిగిందని చెబుతన్నారు మెహ్తా. మార్కెట్ రివర్స్ అయ్యేందుకు 3 కారణాలు ఇదిగో.. పెరిగిన ధరలు, సుంకం పెంపు- ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధరలు మరింత పెరిగాయి. ఇటీవల ధరలు భారీగా తగ్గినప్పటికీ ఇంకా గరిష్ఠ స్థాయిల్లోనే ఉన్నాయి. పాత బంగారానికి క్రేజ్- మరోవైపు బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పతనం అవుతాయన్న భయంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అధిక రేటుకే ఇళ్లలో వాడకుండా నిరుపయోగంగా ఉన్న పాత గాజులు, గొలుసులు అమ్మి క్యాష్ చేసుకునేందుకు
Actor ProfilePolitician
షాకింగ్ ట్విస్ట్.. ఏకంగా 70 శాతం పడిపోయిన బంగారం డిమాండ్.. ఈ కారణాలతోనే సీన్ రివర్స్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Sept 2026
షాకింగ్ ట్విస్ట్.. ఏకంగా 70 శాతం పడిపోయిన బంగారం డిమాండ్.. ఈ కారణాలతోనే సీన్ రివర్స్