
నాలుగు రోజుల క్రితం పెళ్ళి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు ఇది చూసిన సానుభూతి చూపుతుంటే... మరికొందరు పబ్లిసిటీ స్టంట్ అని పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు పెళ్ళి బాట పట్టారు. జూన్ 21న తిరుమలలో షణ్ముఖ్ జస్వంత్ పెళ్ళి చేసుకుంటే... ఆ తర్వాత మూడు రోజులకే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైమా సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ రెండు పెళ్ళిళ్ళ సందడి ఇంకా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగానే.. షణ్ముఖ్ జస్వంత్ పెట్టిన ఓ ఇన్ స్టా స్టోరీ అతని అభిమానులకు కంగారు పుట్టించింది. షణ్ముఖ్ జస్వంత్ ఓ రోజు క్రితం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. 'శుభమా అని పెళ్ళి చేసుకుని మూడు రోజులు కాకుండానే కుర్రాడు ఇలా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడేమిటీ?' అని అందరూ అనుకున్నారు. సహజంగా ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగిన తర్వాత కొందరు అతిగా పనిచేయడం వల్ల, తీవ్ర అలసట కారణంగా హాస్పిటల్ పాలు కావడం సహజం. అయితే... చిత్రం ఏమంటే ఇక్కడ పెళ్ళి కొడుకే హాస్పిటల్ లో చేరిన పరిస్థితి. నిజానికి ఫలానా కారణంగా హాస్పిటల్‌లో చేరానని షణ్ముఖ్ ఆ ఫోటోతో పాటు వివరణ ఇచ్చి ఉంటే ఎవరూ కంగారు పడరు. కానీ ఏమీ చెప్పకపోవడంతో, అసలు ఇది తాజాగా దిగిన ఫోటోనా? లేకపోతే పాత ఫోటోనూ ఏదో ఒక హంగామా చేయడం కోసం ఇలా పోస్ట్ చేశాడా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌లో చేరిన ఫోటో పెట్టిన కొద్ది గంటలకే మళ్ళీ ఓ షూటింగ్‌లో తోటి ఆర్టిస్ట్ కు సలహాలూ, సూచనలు ఇస్తున్న చిన్న వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. సో... షణ్ముఖ్