శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్
Actor ProfilePolitician

శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్
AP7AM4 Sept 2026
శ్రీసిటీ వర్సిటీ ప్రారంభోత్సవంలో నారా లోకేశ్

తమ ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కఠినమైన బాస్ (టఫ్ బాస్) అని, ఆయన కన్న కలలను సాకారం చేసేందుకు తమను నిరంతరం పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలన్న బలమైన ఆకాంక్షతో ఆయన పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా తామంతా అదే వేగంతో పనిచేయాల్సి వస్తోందని అన్నారు. గురువారం తిరుపతి జిల్లా శ్రీసిటీలో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని (ఎస్‌ఐయూ) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రభుత్వ దార్శనికతను, లక్ష్యాలను వివరించారు.2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీరాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. "దేశ ఆర్థికాభివృద్ధిలో మన రాష్ట్రం ముందుండాలి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 220 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నాం" అని ఆయన ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వస్తున్న నూతన విద్యా విధానం, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు దేశ విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నాయని కొనియాడారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారని, ఒక రాష్ట్రం మంచి పని చేస్తే మిగతా రాష్ట్రాలు పోటీపడతాయని ఆయన నమ్ముతారని లోకేశ్ తెలిపారు.ఏపీ యువతకు వరం శ్రీసిటీ యూనివర్సిటీశ్రీసిటీలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు

శ ర స ట వర స ట ప ర ర భ త సవ ల న ర ల క శ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in