శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి
Actor ProfilePolitician

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి

Total News1
Movie Updates0
Sources1
శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం
Andhra Jyothy13 Jun 2026
శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు. నంద్యాల, జూన్ 13: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయలు విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్ దంపతులు వెండి వస్తువులు, బంగారు అభరణాలను స్వామిఅమ్మవార్లకు సమర్పించినట్లు ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. బంగారు నామాలు, చంద్రవంక కలిగిన వెండి జటాజూటం, పలు వెండి పూజావస్తువులు, బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలను సమర్పించారని ఈఓ తెలిపారు. వెండి వస్తువుల బరువు 42 కేజీల 516 గ్రాములు ఉండగా, బంగారు అభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీ గ్రాములుగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దేవస్థానానికి దాతలు అందజేశారు. అన్ని వర్గాలకూ నాణ్యమైన వైద్య సేవలు: మంత్రి సత్యకుమార్ ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారుడు జగనే: డోలా వీరాంజనేయ స్వామి