
Enhancing Srivari Prasadams TTD Signs MoU With CSIR: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 91 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అందులో 32వేల మందికి పైగా


Enhancing Srivari Prasadams TTD Signs MoU With CSIR: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 91 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అందులో 32వేల మందికి పైగా

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న తితిదే ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఉమాశంకర్, సీఎస్‌ఐఆర్ ప్రతినిధి. చిత్రంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు తితిదే.. మైసూరుకు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో నిర్వహించిన రీసెర్చ్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ (ఆర్‌ఐఎస్‌ఈ) సదస్సులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. తితిదే తరఫున ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఉమాశంకర్ పాల్గొన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశోధనలు, ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని, తయారీ సామర్థ్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవడంతో పాటు భక్తులకు విశ్వసనీయమైన సేవలు అందించే అవకాశం కలగనుంది. సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు తితిదే కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు