శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం’ చిత్రబృందం
Actor ProfileActor

శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం’ చిత్రబృందం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం’ చిత్రబృందం
Eenadu18 Jun 2026
శ్రీవారిని దర్శించుకున్న మా ఇంటి బంగారం’ చిత్రబృందం

తిరుమల శ్రీవారిని ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం దర్శించుకుంది. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ జూన్‌ 19న విడుదల కానుంది. ఈ వార్త చదివారా: రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి షాట్.. వెంకటేశ్‌ - అనిల్‌ సినిమా మొదలు