శ్రీవారి ఆలయంలో అద్భుత ఘట్టం.. భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా సహస్రకలశాభిషేకం
Actor ProfilePolitician

శ్రీవారి ఆలయంలో అద్భుత ఘట్టం.. భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా సహస్రకలశాభిషేకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రీవారి ఆలయంలో అద్భుత ఘట్టం.. భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా సహస్రకలశాభిషేకం, భక్తులు పరవశం
Zee Telugu18 Jul 2026
శ్రీవారి ఆలయంలో అద్భుత ఘట్టం.. భోగశ్రీనివాసమూర్తికి వేడుకగా సహస్రకలశాభిషేకం, భక్తులు పరవశం

Special Sahasra Kalasabhishekam Held At Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. నిన్నటి గణాంకాల ప్రకారం, మొత్తం 70,039 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారిలో 34,940 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే, ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి పురస్కరించుకొని నిన్న ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించబడింది. పల్లవరాని సామావై ప్రతిష్టించిన రోజును పురస్కరించుకొని బుధవారం ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వేడుకల సందర్భంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీ భోగ శ్రీనివాస మూర్తి, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేశారు. శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని, పల్లవరాని సామావై ప్రతిష్టించిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం ఈ సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మొదట గరుడాళ్వార్ సన్నిధిలో కౌతుకమూర్తిగా శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి అభిముఖంగా శ్రీ విశ్వక్సేనుల వారిని ఉంచి, అనంతరం మూలమూర్తి అయిన శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని అనుసంధానం చేస్తూ దారం కట్టారు. ఈ ప్రక్రియ ద్వారా శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి నిర్వహించే అభిషేకాది క్రతువులు మూలమూర్తికి కూడా జరిగినట్లు పరిగణించబడుతుంది. వేద పండితుల వేద పారాయణాల మధ్య, అర్చక స్వాములు ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. దీనితో పాటు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు, తిరుమలలో భక్తుల రాక అధికంగా ఉంది. నిన్న (జూన్ 24) రోజున 70,039 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 34,940 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం

శ ర వ ర ఆలయ ల అద భ త ఘట ట భ గశ ర న వ సమ ర త క వ డ కగ సహస రకలశ భ ష క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in