శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి
Actor ProfilePolitician

శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
డాలర్లకే క్రూడాయిల్- ఇంకా పెట్రోల్ 116 రూపాయలా
Oneindia Telugu19 Jul 2026
డాలర్లకే క్రూడాయిల్- ఇంకా పెట్రోల్ 116 రూపాయలా

ఇరాన్-అమెరికా వార్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. తాజాగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 70 డాలర్లకు పడిపోయింది. అయినా భారత్ లో మాత్రం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్

ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్
Oneindia Telugu16 Jul 2026
ఉన్నా పౌరులు కాదు..! కేంద్రం మరో బిగ్ షాక్

మన దేశంలో కొంతకాలంగా విదేశీయుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిష్టవేసి, ఇక్కడే ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు తీసుకుని ఎంచక్కా మన పౌరుల్లా కొనసాగుతున్న

శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి
Oneindia Telugu14 Jul 2026
శ్రీమంతులు రెడీ.. మరి మీరు..! కేంద్రం సాయం కోరిన సాయిరెడ్డి

ఏపీలో గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు బ్రేక్ ఇచ్చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. అడపాదడపా తన ట్వీట్లతో రచ్చ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాల విషయంలో ఉచిత సూచనలు, సలహాలు ఇస్తుండటం ఆయనకు అలవాటే. వాటిని ప్రభుత్వాలు పట్టించుకుంటాయో లేదో తెలియదు కానీ సాయిరెడ్డి ట్వీట్ల హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.పిల్లల్ని కనేయా చేయడమెలా? చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..!సాయిరెడ్డి తన తాజా ట్వీట్లో ఎన్నారైల గురించి ఓ కీలక ప్రతిపాదన చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాలకు ఏదో చేయాలనే ఆరాటంలో ఉన్నారని, కానీ ఇక్కడి ప్రభుత్వాల జోక్యం వల్ల అది సాధ్యం కావడం లేదని, కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని, సాధ్యమైన తక్కువగా ప్రభుత్వాల జోక్యం ఉండేలా చూడాలని సాయిరెడ్డి అభ్యర్ధించారు. ఈ మేరకు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ను ఉద్దేశించి సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు? హైకోర్టు కీలక నిర్ణయం..!తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఎన్నారైలు రోడ్లు, గ్రంథాలయాలు, తాగునీటి సౌకర్యాలు మొదలైన వాటికి నిధులు సమకూర్చడం ద్వారా తమ సొంత గ్రామాలకు తిరిగి సేవ చేయడానికి సుముఖంగా ఉన్నారని సాయిరెడ్డి తెలిపారు. అందుకు ఉద్దేశం, వనరులు ఉన్నప్పటికీ, అటువంటి సహకారాలను అందించడానికి పారదర్శకమైన మార్గం లేదన్నారు. ప్రభుత్వ జోక్యం కనిష్టంగా ఉండేలా, ఎన్నారైల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి వీలు కల్పించే ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జైశంకర్ ను ఆయన కోరారు

శ ర మ త ల ర డ మర మ ర క ద ర స య క ర న స య ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in