
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోయగా వారు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్న తల్లిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. సమాచారం అందుకున్న ఆమదాలవలస పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలా, ఆర్థిక సమస్యలా లేదా ఇతర వ్యక్తిగత కారణాలా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు