శాంతి.. శాంతి
Actor ProfilePolitician

శాంతి.. శాంతి

Total News1
Movie Updates0
Sources1
శాంతి.. శాంతి
Andhra Jyothy16 Jun 2026
శాంతి.. శాంతి

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా... 19న సంధిపై సంతకాలు.. జెనీవాలో ఇరాన్‌తో ఒప్పందం డీల్‌పై ఇప్పటికే డిజిటల్‌గా సంతకాలు జరిగాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన హోర్ముజ్‌ జలసంధి ఇప్పటికే తెరుచుకుందని వెల్లడి ధ్రువీకరించిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ తాత్కాలిక అవగాహనా ఒప్పందమే: ఇరాన్‌ మీడియా హోర్ముజ్‌లో మా దళాల గస్తీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ వాషింగ్టన్‌/ టెహ్రాన్‌, జూన్‌ 15: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శాంతి ఒప్పందంపై లాంఛనంగా రెండు దేశాలు సంతకాలు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రకటించారు. ఒప్పందంపై డిజిటల్‌గా ఇప్పటికే సంతకాలు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ పాక్షికంగా తెరిచిందని, చమురు నౌకలు ప్రయాణం కూడా మొదలుపెట్టాయని తెలిపారు. 19న జలసంఽధిని పూర్తిగా తెరుస్తారని అన్నారు. ఈ ఒప్పందం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి సంధి కోసం తదుపరి చర్చలు జరుగుతాయని తెలిపారు. ‘ఇరాన్‌తో డీల్‌ పూర్తయింది. ప్రపంచానికి శుభాకాంక్షలు. శుక్రవారం స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు చేయగానే హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటుంది. ఈ 60 రోజులు వాణిజ్య నౌకలు ఎలాంటి టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇరాన్‌ పోర్టులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని వెంటనే తొలగించాలని మా నావికాదళానికి కూడా ఆదేశాలిచ్చాను’ అని ట్రూత్‌ సోషల్‌లో తెలిపారు. ఒప్పందంపై డిజిటల్‌గా ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ ఘలిబాఫ్‌, మరో ఇరాన్‌ సీనియన్‌ నాయకుడు సంతకాలు చేసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. 19న జరిగేది లాంఛనప్రాయ కార్యక్రమమేనని పేర్కొంది. డిజిటల్‌ సంతకాలు

శ త శ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in