
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం' కుదిరింది. వాషింగ్టన్ డీసీ(అమెరికా), జూన్ 27: పశ్చిమాసియా రీజియన్‌లో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం' కుదిరింది. 'శాశ్వత శాంతి, భద్రత' సాధించడమే లక్ష్యంగా కుదిరిన ఈ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. 'ఇది ఒక సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు' - మార్కో రూబియో ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. 'సార్వభౌమాధికారం కలిగిన లెబనాన్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మధ్య అమెరికా మద్దతు, మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదరడం సంతోషకరం. పూర్వపు ప్రశాంత వాతావరణాన్ని మళ్లీ తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది, అంతేకాదు, ఇది చాలా కష్టతరం కూడా. కానీ, ఈ రోజు ఆ సుదీర్ఘ ప్రయాణంలో మేము తొలి అడుగు వేశాం. కొన్నిసార్లు మొదటి అడుగే అత్యంత కష్టమైనది, కానీ దాని కోసం ఈ రోజు మనం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం' అని పేర్కొన్నారు. ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు నిరంతరం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ రూబియో.. 'అక్కడ సైరన్ మోగిన ప్రతిసారీ పిల్లలు చదువులు ఆపేయాలి, ప్రజలు పనులు మానేసి బంకర్లలో దాక్కోవాల్సి వస్తోంది. ఈ దాడులు చేస్తున్నది లెబనాన్ ప్రజలు లేదా అక్కడి ప్రభుత్వం కాదు.. బయటి శక్తులు (ఉగ్రవాద ముఠాలు) ఆ భూభాగాన్ని వాడుకుని అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో చాలా కష్టమైన పని ఉంది, దేన్నీ మేము తక్కువగా అంచనా వేయడం లేదు, కానీ దీని ప్రాముఖ్యత మాకు తెలుసు' అని రూబియో