
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Shani Nakshatra Gochar July 2026: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు తన నక్షత్ర సంచారం చేసింది.. జూలై 2, గురువారం రోజున శని నక్షత్ర సంచారం చేశాడు.. ప్రస్తుతం మీన రాశిలో సంచార దశలో ఉన్న.. శని దేవుడి నక్షత్ర మార్పు కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది కాబట్టి.. ఈ నక్షత్ర మార్పు ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. అయితే, విదేశీ ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తున్నవారు తప్పకుండా ఎంతో ఓపికగా ఉండడం చాలా మంచిది. వృషభ రాశి: వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో శని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి: శని దేవుడి ఆశీస్సులతో వీరికి అదృష్టం కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు