
Telugu Times•14 Jul 2026
వైసీపీ హయాంలోనే లూటీవైసీపీ హయాంలోనే పోలవరం (Polavaram) కట్టల మట్టి లూటీ జరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి అక్రమాలకు సంబంధించిన ఫొటోలను చూపిస్తూ కట్టు కథనాలతో సాక్షిపత్రిక (Sakshi Newspaper) అడ్డంగా దొరికిపోయిందని విమర్శించారు. పోలవరం కుడికాలువ కింద 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని దోచేశారని, దీనిపై 2022లోనే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (National Green Tribunal) కేసు కూడా నమోదైందన్నారు. కానీ, ఇప్పుడేదో జరిగిపోందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ నాయకులు, ఫేక్ పార్టీ చేసే ఫేక్ ప్రచారంతో అడ్డంగా దొరికిపోయారన్నారు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలను చెప్పాలని డిమాండ్ చేశారు