
ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘లెనిన్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. జులై 10న ఇది విడుదల కానుంది (Lenin Release Date). ఈ చిత్రం ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన (Akkineni Akhil) రీసెంట్ ఇండస్ట్రీ హిట్ ‘మా ఇంటి బంగారం’ గురించి మాట్లాడారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిందన్నారు. ‘‘లెనిన్ (Lenin) ప్రమోషన్స్‌లో ఉండడంతో నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ, ఆ చిత్ర ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఆ సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. చిత్రం చాలా సహజంగా అనిపించింది. మంచి ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే అంశంతో పాటు, పవర్‌ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళా పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత (Samantha) చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ సామ్’’ అంటూ సమంతతో పాటు చిత్రబృందానికి కూడా అఖిల్ విషెస్ చెప్పారు. ఇక జూన్ నెల తనకు ఎంతో నచ్చిందన్నారు సమంత. ‘అద్భుతమైన కథ’ అంటూ జూన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఆమె సుదీర్ఘ విరామం తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ జూన్‌లోనే విడుదలైంది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఈ టికెట్ సేల్స్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో వర్క్‌వుట్‌లు చేస్తోన్న వీడియోను పంచుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు