
Chitrajyothy•15 Jun 2026
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేదర్శకుడు వెంకీ అట్లూరి సర్ప్రైజ్ ఇచ్చారు. అయన దర్శకత్వంలో రానున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్ 'ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడో వెల్లడించారు. ఈ చిత్రంలో తొలి పాటను ఎవరు పాడుతున్నారో చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు . సూర్య (Suriya) కథానాయకుడిగా వెంకీ అట్లూరి (venky atluri) తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వీరిద్దరి కాంలోలో వస్తున్న తొలి సినిమా ఇది. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. ఇందులో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ గురించి చెబుతూ ఓ ఆసక్తికర వీడియో రిలీజ్ చేశారు. ఈ నెల 17న తొలి పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పాటను హీరోయిన్ మమితా పాడబోతున్నట్లు తెలిపారు