
అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఫార్మా సిటీలోని 'దక్షిణ్ ఎనర్జీ' పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని, అత్యంత మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలని వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రతను గమనించి ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ కేంద్రం నుంచి మరొక ఫైర్ ఇంజన్‌ను తక్షణమే ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం నెల్లూరు ఏఎస్‌పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక