విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మక సదస్సు.. నవంబర్ 12
Actor ProfilePolitician

విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మక సదస్సు.. నవంబర్ 12

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మక సదస్సు.. నవంబర్ 12, 13 తేదీల్లో సీఐఐ కార్యక్రమం
Zee Telugu18 Aug 2026
విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మక సదస్సు.. నవంబర్ 12, 13 తేదీల్లో సీఐఐ కార్యక్రమం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 31st Edition CII Summit: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్‌లో నిర్వహించనున్నారు. విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ సదస్సు కంటే ముందుగా 5 చోట్ల ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కొత్త ఆలోచనలకు.. అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలని సూచించారు. ఎంఓయూలు, పెట్టుబడులతో పాటు నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026పై సోమవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే ఈసారి ప్రాంతీయ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World థీమ్‌తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. సీఐఐ సదస్సులో భాగంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను ఆహ్వానించాలని చెప్పారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 'విశాఖపట్టణంలో జరిగే

వ శ ఖపట టణ ల ప రత ష ట త మక సదస స నవ బర 12 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in