విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు
Actor ProfilePolitician

విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు
NTV Telugu21 Aug 2026
విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు

President Droupadi Murmu Vizag Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి, అనంతరం నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లోని చోళ అతిథి గృహంలో బస చేయనున్నారు. ఆ తర్వాత బీచ్ రోడ్డులోని వీ కన్వెన్షన్‌కు చేరుకుని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 373 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనుండగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. గవర్నర్, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకు చేరుకుని కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన షెడ్యూల్‌.. * ఉదయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న రాష్ట్రపతి భారత వాయుసేన ప్రత్యేక విమానం.. * మధ్యాహ్నం 12.35 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము.. * ఎయిర్‌పోర్టులో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న రాష్ట్రపతి.. * ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డుమార్గాన నగరంలోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి. * మధ్యాహ్నం గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము.. * తిరిగి సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి.. * సాయంత్రం 4.30 గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు బయల్దేరనున్న రాష్ట్రపతి.. * బుధవారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంమండలం జంతులూరుకి ముర్ము.. * కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము

వ శ ఖక ర ష ట రపత ద ర పద మ ర మ గ ర జన వర స ట త ల స న తక త సవ న క హ జర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in