
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 17 ఏళ్ల టెక్నాలజీ పరిశోధకుడు, సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ మరో సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఇటీవలే సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని లోపాలను ఎండగట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ (సీపీపీ) పోర్టల్ నుండి దాదాపు 1.66 కోట్ల ప్రభుత్వ కొనుగోలు రికార్డులను సేకరించి, వాటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ, ఒక బహిరంగ డేటా పోర్టల్‌ను ప్రారంభించాడు. పారదర్శకత అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే తాను ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు సార్థక్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. మార్కుల పోరాటం.. స్కామ్ గుట్టురట్టు సార్థక్ సిద్ధాంత్ ఇటీవల సీబీఎస్‌ఈ క్లాస్ 12 పరీక్షలు రాశారు. అయితే ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో, రీవాల్యుయేషన్ కోసం తన స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలను కోరారు. ఈ ప్రక్రియను లోతుగా పరిశీలిస్తున్న సమయంలో, పరీక్షల మూల్యాంకనానికి ఉపయోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానంలో, దానికి అనుబంధంగా ఉన్న ‘కోఎమ్ట్’ అనే సంస్థ టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆయన గుర్తించారు. గత రెండు వారాలుగా రేయింబవళ్లు శ్రమించి సేకరించిన ఈ కీలక డేటాను sarthaksiddhant.com అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ రికార్డులను పౌరులు, జర్నలిస్టులు, పరిశోధకులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని విశ్లేషించవచ్చని సార్థక్ పిలుపునిచ్చారు. రంగంలోకి రాహుల్ గాంధీ ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జూన్ 2వ తేదీన సార్థక్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన 8 నిమిషాల 15 సెకన్ల వీడియోను జూన్ 7న ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. సీబీఎస్‌ఈ, కోఎమ్ట్ సంస్థల మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని ఈ యువకుడు బట్టబయలు చేశాడని రాహుల్ ప్రశంసించారు. నేటి యువత కేవలం రీల్స్ చేస్తూ, పకోడీలు వేపుకుంటూ కూర్చోవాలని మోదీ