
గత వారం విడుదలైన సినిమాల్లో 'సింగ్ గీతం' ఒక్కటే కాస్తంత వైవిధ్యం ప్రదర్శించింది. ఈ వీకెండ్ లో ఆరు వరైటీ మూవీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత తెర మీద కథానాయికగా కనికట్టు చేసి దాదాపు మూడేళ్ళు గడిచిపోయింది. ఆమె నటించిన చివరి చిత్రం 'ఖుషీ' 2023 సెప్టెంబర్ 1న వచ్చింది. గత ఏడాది వచ్చిన 'శుభం'లో సమంత కేవలం అతిథి పాత్రలోనే కనిపించారు. అభిమానుల దాహార్తిని తీర్చుతూ ఇప్పుడు సమంత 'మా ఇంటి బంగారం'గా రాబోతోంది. ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను నందినీరెడ్డి డైరెక్ట్ చేశారు. సంప్రదాయబద్ధమైన గృహిణిగానూ, ఫ్యామిలీని సేవ్ చేసే కోడలిగానూ సమంత రెండు భిన్నమైన పాత్రలను ఇందులో పోషించడం విశేషం. దాంతో సహజంగానే 'మా ఇంటి బంగారం'పై అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ తనయుడు నవీన్ నిర్మాతగా కంటే... హీరోగానే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన నవీన్ చాలా గ్యాప్ తర్వాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రాశీసింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను కమల్ తేజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి అందుకోగలననే ధీమాను వడ్డే నవీన్ వ్యక్తం చేస్తున్నారు. ఇదే శుక్రవారం హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన 'దీవానా' సినిమా విడుదల అవుతోంది. ప్రేమలోని ఇంటెన్సిటీని తెలియచేసే ఈ సినిమాను శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించాడు. హార్డ్ హిట్టింగ్ మూవీస్ తెరకెక్కించిన సునీల్ కుమార్ రెడ్డి ఇప్పుడింకో ప్రయోగాత్మక చిత్రంతో జనం ముందుకొస్తున్నారు. ట్రాన్స్ జండర్స్‌తో పాటు ప్రముఖ నటీనటులు యాక్ట్ చేసిన కోర్ట్ రూమ్ డ్రామా 'ఎల్.జి.బి.టి. ఏ లీగల్ బ్యాటిల్' శుక్రవారం వస్తోంది. మలయాళ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్'తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చిదంబరం. ఆయన రూపొందించిన తాజా చిత్రం 'బాలన్-ది బాయ్'