వాళ్లసలు కాపు నాయకులే కాదు
Actor ProfilePolitician

వాళ్లసలు కాపు నాయకులే కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాళ్లసలు కాపు నాయకులే కాదు
TeluguOne21 Jul 2026
వాళ్లసలు కాపు నాయకులే కాదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఇటీవల నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశం, సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడిన జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ వైసీపీ యత్నాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు అసలైన కాపు నాయకులు కారని.. వారు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బానిసలుగా పనిచేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని బూతులు తిట్టించినప్పుడు ఈ నేతల ఆత్మగౌరవం ఎటు పోయిందని ప్రశ్నించారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లను రద్దు చేసినప్పుడు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలను అణచివేసినప్పుడు నోరు మెదపని వీరు.. ఇప్పుడు హఠాత్తుగా కులప్రేమను ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు. 14 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరామర్శించని వైసీపీ నేతలు.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలు పెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ వైసీపీ నేతలంతా ఘోరంగా ఓడిపోయారని, దీన్ని బట్టే కాపు యువత వీరిని నాయకులుగా అంగీకరించడం లేదనేది స్పష్టమవుతోందని టట శ్రీనివాస్ పేర్కొన్నారు. చారిత్రకంగా కాపు సామాజిక వర్గం నుంచి ఎందరో మహానుభావులు సమాజానికి సేవలందించారని, కానీ కోడిగుడ్డు ఆమ్లెట్ కథలు చెప్పే అంబటి రాంబాబు, బియ్యం కేసుల్లో ఉన్న

వ ళ లసల క ప న యక ల క ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in