
దోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్ పనులు పూర్తిచేశామని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కొల్లంవాగు నుంచి 1 టీఎంసీ నీరు టన్నెల్స్‌లోకి చేరేలా 1.80లక్షల క్యూబిక్ మీటర్లకు గాను.. ఇప్పటి వరకు 58వేల క్యూబిక్ మీటర్ల మక్ తొలగించామన్నారు. గత 20 నెలల్లో టన్నెల్-2లో 7 కి.మీ లైనింగ్‌కి గాను.. 5.5 కి.మీ పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన 1.5 కి.మీ లైనింగ్ జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని వివరించారు. ఫీడర్ కెనాల్‌లో 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ పనులను జనవరిలో ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేశామన్నారు. తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్‌తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఈనెలలో సీఎం చేతుల మీదుగా నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం అందిస్తామని తెలిపారు. నల్లమలసాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు నింపేందుకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.905 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల వివరించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు.. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహూకరించారు. ఏపీలో