విరుచుకుపడుతున్న అమెరికా
Actor ProfilePolitician

విరుచుకుపడుతున్న అమెరికా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విరుచుకుపడుతున్న అమెరికా
Oneindia Telugu5 Aug 2026
విరుచుకుపడుతున్న అమెరికా

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఆ దేశానికి చెందిన 10 కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ పరిణామంతో తీవ్ర సంక్షోభంలో పడింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ఒక వాణిజ్య చమురు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరపడంతో, అమెరికా ఈ ప్రతీకార చర్యకు దిగాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైన్యానికి చెందిన నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, వైమానిక రక్షణ స్థావరాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లను అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధ విమానాలు ఈ దాడులు జరిపాయి. సుమారు రెండు మిలియన్ల బారెళ్ల ముడి చమురుతో పయనిస్తున్న కికు అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్ వన్ వే డ్రోన్‌తో దాడి చేయడమే ఈ తాజా వైమానిక ప్రతీకార దాడులకు ప్రధాన కారణమని అమెరికా స్పష్టం చేసింది.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తాము చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిస్థితి చేయి దాటితే ఇరాన్ ఉనికికే ముప్పు వస్తుందని హెచ్చరించారు. అటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఇరు దేశాల మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇరాన్ ముందుకు రావాలని, హింసతో సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడానికి ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది.. మొదటి నుంచీ. ఈ జలసంధి ద్వారా ప్రయాణించే ట్యాంకర్లు తమ ఆదేశాలను పాటించాలని, టోల్ ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే

వ ర చ క పడ త న న అమ ర క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in