
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. AP Drug Rehabilitation Centers: రాష్ట్రంలోని 16 వ్యసన విముక్తి కేంద్రాలను (డి-అడిక్షన్) రూ.9.86 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కేంద్రాల్లో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు, బయో-ఫీడ్ బ్యాక్ మెషిన్, ఈసీజీ మెషిన్ వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాల్లో మూడింటిని పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలతో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ'లుగా తీర్చి దిద్దుతామని చెప్పారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం (శుక్రవారం, 26న) సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి సత్యకుమార్ ప్రకటన జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25 వ్యసన విముక్తి కేంద్రాలు నడుస్తున్నాయి. మద్యం, గంజాయి, నల్ల మందు, మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం, పీల్చడం, ఇతర వ్యసనాలకు అలవాటుపడిన వారు వాటికి దూరంగా ఉండేందుకు ముందుకువస్తే ఈ కేంద్రాల్లోని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్హత కలిగిన వారు వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ కేంద్రాల్లోని అవసరాలకు 346 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 2024 నాటికి 200కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 57 పోస్టుల్ని భర్తీచేయగా ఇందులో వైద్యులు, కౌన్సెలర్లు, నర్సులు, వార్డు బాయ్ లు, యోగా థెరపిస్ట్, ఇతర పోస్టులు ఉన్నాయి. మరో 123 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీ జరిగి, భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ నియామకాలు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇవి