
మహేష్‌బాబు(mahesh babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) తెరకెక్కిస్తున్న భారీ పాన్‌వరల్డ్ మూవీ వారణాసి(Varanasi) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ ప్రాజెక్ట్, ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్, మహేష్‌బాబు కొత్త లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, సినిమాలోని కీలకమైన వారణాసి ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేశారు. ముఖ్యంగా మహేష్‌బాబు మరియు ఒక ఎద్దు(Bull) పాల్గొనే సీన్స్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కథలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుందని, రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో ఈ భాగాన్ని తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణతో పాటు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లే సినిమాగా వారణాసి నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది