వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషనే కోర్ పాయింట్.. కీలక విషయాలు వెల్లడించిన రాజమౌళి
Actor ProfileActor

వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషనే కోర్ పాయింట్.. కీలక విషయాలు వెల్లడించిన రాజమౌళి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషనే కోర్ పాయింట్.. కీలక విషయాలు వెల్లడించిన రాజమౌళి
Samayam Telugu8 Aug 2026
వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషనే కోర్ పాయింట్.. కీలక విషయాలు వెల్లడించిన రాజమౌళి

ఇండియన్ సినిమాలో అపజయం ఎరుగని దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఇప్పటి వరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్టే. కెరీర్ ప్రారంభం నుంచీ వేటికవే ప్రత్యేకమైన చిత్రాలను రూపొందిస్తూ, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. ఆయన సినిమాలను మనం నిశితంగా పరిశీలిస్తే.. ప్రతీ చిత్రంలో భారీ హంగులతో పాటుగా బలమైన ‘ఎమోషన్’ ఉంటుంది. ఏ జోనర్ లో సినిమా తీసినా, ఎలాంటి కథను తెరకెక్కించినా అందులో ఎమోషన్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు ‘వారణాసి’ మూవీలోనూ భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నారు రాజమౌళి. సినిమా జానర్ ఏదైనా, ఎలాంటి కథ అయినా, పాత్రలు ఎలాంటివైనా.. కీలకమైన ‘ఎమోషన్’ ను బలంగా ఒడిసి పట్టుకొని, దాన్ని తెరపై అద్భుతంగా చూపించడంలో రాజమౌళి దిట్ట. ఒళ్లు గగుర్పరిచే యాక్షన్ ఘట్టాలు, కళ్లు చెదిరే సెట్లు, భారీ హంగులతో పాటుగా భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటారు. కోర్ పాయింట్ ను గట్టిగా పట్టుకొని, దాంతో ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దుతారు. అదే జక్కన్న విజయ రహస్యం అని చెప్పాలి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలో ఎమోషన్ ఏంటనేది తాజాగా ఆయన బయటపెట్టారు. ‘వారణాసి’ అనేది మల్టీ జోనర్ మూవీ. ఇందులో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్.. ఇలా అనేక అంశాలు ఉండబోతున్నాయి. అందులో తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ అనేది కోర్ పాయింట్. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా సంగతులను పంచుకున్నారు.రాజమౌళి మాట్లాడుతూ “ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల దగ్గర నుంచి అంటార్కిటికాలోని చలి, మంచు వరకు.. రామాయణంలోని దేవుళ్ల నుంచి జాతీయ విపత్తులు, ఫాంటసీ ఎలిమెంట్స్ వరకు.. ఇలా అనేక అంశాలను ‘వారణాసి’ అనే ఒకే సినిమాలో ప్రేక్షకులు అనుభూతి చెందబోతున్నారు

వ రణ స ల త డ ర క డ క ల ఎమ షన క ర ప య ట క లక వ షయ ల వ ల లడ చ న ర జమ ళ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in