వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్
Actor ProfileActor

వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్
10TV Telugu24 Jul 2026
వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్

Rajamouli : రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 800 కోట్లతో గ్రాండ్ గా విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కనీసం ఎలాంటి రూమర్ కూడా లేదు రాజమౌళి నెక్స్ట్ సినిమాపై. అయితే తాజాగా వచ్చిన ఓ అప్డేట్ తో రాజమౌళి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది అంటున్నారు. రాజమౌళి నెక్స్ట్ సినిమా బాహుబలి 3 అని అంటున్నారు. నేడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో బాహుబలి ది టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ లో రానా, ప్రభాస్, అనుష్క.. ముగ్గురూ మాట్లాడుతూ అధికారికంగా బాహుబలి పార్ట్ 3 ని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో బాహుబలికి కొనసాగింపు ఉన్నా, ప్రీక్వెల్ ఉన్నా ప్రభాస్, అనుష్కనే హీరో హీరోయిన్స్ గా ఉంటారని తెలుస్తుంది. ప్రీక్వెల్ అయితే రానా కూడా ఉండే అవకాశం ఉంది. బాహుబలికి ముందు మాహిష్మతి సామ్రాజ్యం ఏంటి అనే ఒక కథ ఉన్నట్టు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెలిపారు. అలాగే కొత్తగా రాజు అయిన మహేంద్ర బాహుబలికి ఎదురైనా ఇబ్బందులు ఉంటాయి అనే పాయింట్ తో కూడా కథ రాసుకోవచ్చు అని తెలుస్తుంది. అయితే వారణాసి సినిమా తర్వాత రాజమౌళి తన సమర్పణలో ఇషాన్ శుక్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సిరీస్ పనులు చూసుకొని అది అయ్యాక బాహుబలి 3 పనులు మొదలు పెడతారని సమాచారం. ఈ లోపు ప్రభాస్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసుకొని వస్తాడని తెలుస్తుంది

వ రణ స తర వ త ర జమ ళ న క స ట స న మ ఫ క స అయ నట ట హ ర హ ర య న స క డ ఫ క స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in