వెయ్యి కోట్ల క్లబ్ చూడని తమిళ సినిమా
Actor ProfileActor

వెయ్యి కోట్ల క్లబ్ చూడని తమిళ సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెయ్యి కోట్ల క్లబ్ చూడని తమిళ సినిమా
Chitrajyothy2 Sept 2026
వెయ్యి కోట్ల క్లబ్ చూడని తమిళ సినిమా

తమిళ సినిమాకు ఉన్న మార్కెట్ సౌత్ ఇండియాలో ఇతరులకు లేదనే చెప్పాలి. అయితే కోలీవుడ్ కు ఓ కొరత ఉంది. దాంతో ఈ పాతికేళ్ళలో తమిళ టాప్ గ్రాసర్స్ గా నిలచిన సినిమాలను తలచుకొని ఆ బాధను కాస్త మరచిపోతున్నారు అక్కడి ఫ్యాన్స్. ఇంతకూ వారికున్న కొరత ఏంటో!? సౌత్‌లో తమిళ సినిమాకు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, కర్ణాటక, కేరళల్లోనూ మార్కెట్ ఉంది. అలా దక్షిణాది ఐదు రాష్ట్రాల్లోనూ బలమైనదిగా రాజ్యమేలింది కాబట్టే పదేళ్ళ క్రితం వరకూ అందరూ సౌత్‌లో తమిళ సినిమా నంబర్ వన్ అని భావిస్తూ వచ్చారు. అయితే రాజమౌళి 'బాహుబలి' సిరీస్ దక్షిణాది అంటే తెలుగు సినిమానే అనే రేంజ్ కు తీసుకు వెళ్ళింది. తరువాత ఆ బాటలోనే తెలుగు సినిమా ఇప్పటికీ పయనిస్తోంది. మొన్నటి దాకా సౌత్‌లో టాప్ గా వెలిగిన కోలీవుడ్ గత పదేళ్ళ నుంచీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి తంటాలు పడుతూనే ఉంది. కానీ, ఇప్పటి దాకా ఏ తమిళ చిత్రం కూడా ఆ ఫీట్‌ను సాధించలేక పోయింది. అయినా తమిళ సినీ ఫ్యాన్స్ ఈ పాతికేళ్ళలో అంటే 2001 నుండి 2025 దాకా టాప్ గ్రాసర్స్ గా నిలచిన చిత్రాలను గుర్తు చేసుకొని మురిసిపోతూ ఉండడం విశేషం! అందులో 2001లో మొట్టమొదట అజిత్ 'దినా' చోటు దక్కించుకుంది. ఈ యేడాది ఇప్పటి వరకూ రిలీజైన తమిళ చిత్రాల్లో 'కరుప్పు' అంటే తెలుగులో 'వీరభద్రుడు'గా వచ్చిన సూర్య సినిమా టాప్ గ్రాసర్ గా నిలచింది. నిజం చెప్పాలంటే టాప్ గ్రాసర్స్ గా నిలచిన తమిళ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సేమీ కావు. కొన్ని కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. అందరికన్నా మిన్నగా అత్యధిక టాప్ గ్రాసర్స్ చూసిన స్టార్ గా రజనీకాంత్ నిలిచారు. ఈయన నటించిన 9 సినిమాలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. అందులో 'చంద్రముఖి, శివాజీ, రోబో' చిత్రాలు

వ య య క ట ల క లబ చ డన తమ ళ స న మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in